About Amaravati Runners
Empowering Healthy Lifestyle Through Movement
Our MissioN
Promoting Health and Happiness
Our mission is to inspire and engage communities in embracing active lifestyles and fostering well-being through our diverse events and initiatives.
We strive to create a healthier and happier society by encouraging participation in walking, running, cycling, and social responsibility activities.
Extraordinary Experiences
For 8 impactful years, Amaravati Runners, a non-profit organization founded by passionate individuals, has been igniting the spirit of health and happiness through marathons, cycling events, and community outreach programs. Our mission is to inspire people to lead active lifestyles and make a positive impact across various cities.
Through numerous events like treks, kids’ runs, and food distribution initiatives, we have tirelessly promoted physical and mental well-being. Each endeavor has been a step towards creating a healthier and happier community, spreading awareness and enthusiasm for fitness and social responsibility.
With each endeavor, we have strived to create a healthier and happier community.
అమరావతి రన్నర్స్
సానుకూల దృక్పధం ఉన్న కొంతమంది విద్యావంతులు ‘అమరావతి రన్నర్స్’ అనే పేరున గత 8 సంవత్సరాలుగా రాష్ట్రం లో వివిధ నగరాలలో ఆరోగ్యం, ఆనందం అనే అంశాల గురించి అవగాహన కలిగిస్తూ, నడక, పరుగులపై ఆసక్తిని పెంచే కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
అభివృద్ధికి మారు పేరుగా, మంచి సమాజం కోసం పరితపిస్తూ అహర్నిశలూ శ్రమపడే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారే ఈ బృందానికి స్ఫూర్తి. ఆయన ఆశయాలకు అనుగుణంగా ఆరోగ్యం, ఆనందాలను పంచుతూ, రన్ మైల్స్… స్ప్రెడ్ స్మైల్స్… అనే సందేశాన్ని సమాజానికి విజయవంతంగా పరిచయం చేశారు ఈ పరుగు వీరులు. ఫలితంగా కొన్ని వేల మందికి ఉదయం నడక అలవాటు అయ్యింది. వందల మంది జాతీయ, అంతర్జాతీయ మారథాన్లలో పరిగెత్తే స్థాయికి ఎదిగారు. వీరి ప్రయత్నం చాలా మందికి శారీరక ఆరోగ్యంతో పాటు, మానసిక ఆనందం మరియు ఆరోగ్యకరమైన భావోద్వేగాలతో ఉత్తేజంగా బ్రతికే పరిస్థితిని కల్పించిందనటంలో సందేహం లేదు. అందుకు చాలా దృష్టాంతాలుకూడా ఉన్నాయి.
2014-19 మధ్యలో అప్పటి ప్రభుత్వ సహకారంతో అమరావతి రన్నర్స్ వివిధ కార్యక్రమాలతో సమాజంలో ఉత్తేజం నింపే ప్రయత్నాలు చేసింది. అందులో ముఖ్యమైనది మన కలల రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధిని సామాజిక పరిచయం చేస్తూ అమరావతి సిటీ రన్ పేరుతో జరిగిన మెగా మారథాన్. వివిధ రాష్ట్రాలనుండి వచ్చిన దాదాపు 5000 మందికి పైగా రన్నర్స్ High Court, NID, VIT లాంటి ఎన్నో ప్రతిష్టాత్మక కట్టడాలను చూస్తూ, అక్కడ పని చేస్తున్న 40,000 మందికి పైగా కార్మికుల హర్షధ్వానాల మధ్య చేసిన పరుగులు ప్రతి ఒక్కరి మనసులో చెరగని ముద్రగా ఉంటాయి.
Amaravati Runners
A few educated people with a positive attitude have been organizing programs in the name of ‘Amaravati Runners’ for the last 8 years in various cities of the state, creating awareness about the aspects of health and happiness and increasing interest in walking and running.
The inspiration of this group is Shri Nara Chandrababu Naidu, who strives tirelessly for a better society. These running heroes have successfully introduced the message of Run Miles… Spread Smiles… As a result, some thousands of people got into the habit of walking in the morning. Hundreds have gone on to run national and international marathons. There is no doubt that their efforts have enabled many people to live vibrantly with physical health, mental happiness and healthy emotions. There are many examples of that.
Between 2014-19, with the support of the then government, Amaravati Runners made efforts to enliven the society with various programs. The most important of which is the mega marathon called Amaravati City Run, which is a social introduction to the development going on in our dream capital, Amaravati. More than 5000 runners from different states saw many prestigious buildings like High Court, NID, VIT and ran amidst the cheers of more than 40,000 workers working there, leaving an indelible impression in everyone’s mind.
'Know Your Capital' సైక్లింగ్ ఈవెంట్
సి.ర్.డ్.ఆ. సహకారంతో అమరావతి రన్నర్స్ ఆధ్వర్యంలో Know Your Capital పేరుతొ జరిగిన సైక్లింగ్ ఈవెంట్ ఇంకో మరువలేని జ్ఞాపకం. దాదాపు 1000 మంది సైక్లిస్టులు ఇందిరాగాంధీ స్టేడియం నుండి ప్రజావేదిక మీదుగా అమరావతిలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను గమనిస్తూ, సమీప భవిష్యత్తులో ఆవిష్కృతమవనున్న ఒక మహా నగరాన్ని ఊహించుకుంటూ చేసిన సైకిల్ రైడ్ ఒక మరువలేని జ్ఞాపకం. దేశంలోని రాజకీయ నాయకులూ అందరిలోనూ ఒక విశిష్ట వ్యక్తిత్వం మన చంద్రబాబు గారిది. ఆయన ఆలోచనలను, దూరద్రుష్టిని అర్ధం చేసుకోవటం చాలా కష్టం. Happiness Index పేరుతొ సంతోషంగా ఉన్న ప్రజల శాతాన్ని కొలిచే ప్రయత్నం చేసింది, భారత దేశంలోనే బహుశా మొదటి నాయకుడు చంద్రబాబు గారేనేమో… అమరావతి రన్నర్స్ ఆవిర్భావానికి మూల కారణం ఈ అంశమే…
'Know Your Capital' Cycling Event
C.R.D.A. Another unforgettable memory was the cycling event organized by Amaravati Runners in collaboration with Know Your Capital. A cycle ride by around 1000 cyclists from Indira Gandhi Stadium across Prajavedika observing the various development programs in Amaravati and envisioning a great city to be unveiled in the near future was an unforgettable memory. Our Chandrababu gaaru is a unique personality among all the political leaders of the country. It is very difficult to understand his thoughts and vision. In the name of Happiness Index, it tried to measure the percentage of happy people, perhaps the first leader in India is Mr. Chandrababu. This is the main reason for the emergence of Amaravati Runners.
అమరావతి కిడ్స్ రన్
ఆనందం ఆరోగ్యం అనగానే మనసులో మెదిలేది పిల్లలే. 4 నుండి 12 సంవత్సరాల పిల్లలు వారి అమ్మ లేదా నాన్నతో కలిసి పరిగెత్తే ఈవెంట్ ‘అమరావతి కిడ్స్ రన్‘… మన రాష్ట్రంలోనే మొదటిసారి నిర్వహించబడిన ఈ కార్యక్రమానికి 1200 మందికి పైగా పిల్లలు తమ తల్లితండ్రులతో కలిసి చేసిన సందడి చూసి తీరవలసిందే.
అమరావతి రన్నర్స్ సభ్యులకు వర్తించనిది ముసలితనం. ఈ బృందంలో 17 నుంచి 78 సంవత్సరాల వరకు అన్ని వయసులవారు ఒకేరకంగా ఆలోచిస్తారు. ఒకే విధంగా ప్రవర్తిస్తారు. వీరికి వయసు అనేది ఒక అంకె మాత్రమే. జాతీయంగా, అంతర్జాతీయంగా జరిగే ఎన్నో రన్నింగ్ మరియు సైక్లింగ్ కార్యక్రమాలకు ఇంట్లో అందరూ కలిసి పాల్గొంటారు. రన్నింగ్ అయినా, సైక్లింగ్ అయినా, ట్రెక్కింగ్ అయినా, లేదా ఏ ఇతర సేవా కార్యక్రమాలయినా కుటుంబంలో అందరూ కలిసే పాలుపంచుకుంటారు. Fitness అనేది family activity గా భావిస్తూ కలిసి నడిచే కుటుంబం ఎప్పటికీ కలిసే ఉంటుందని వీరి నమ్మకం. ఆ సిద్ధాంతాన్ని వీళ్ళు ప్రచారం చేస్తూ ఉంటారు. అమరావతి రన్నర్స్ సభ్యులు రన్నింగ్ లోనూ, సైక్లింగ్ లోనూ వ్యక్తిగతంగా అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభను కనబరిచారు. ఈ బృందసభ్యులు ఎక్కడ ఉన్నా, ఉదయం 5 గంటలకు లేవటం, కనీసం రెండు గంటలపాటు ఆనందంగా నడవటం అనేది దినచర్యగా మార్చుకున్నారు.
Amaravati Kids Run
When we think of happiness and health, we think of children. ‘Amaravati Kids Run‘ is an event where children between 4 to 12 years of age run with their mom or dad… a first of its kind in our state, more than 1200 kids along with their parents made a splash.
Old age is not applicable to Amaravati Runners members. All age groups from 17 to 78 years think alike in this group. behave the same way. Age is just a number for them. Everyone at home participates in many national and international running and cycling events. Be it running, cycling, trekking, or any other service activity, everyone in the family gets involved. They believe that fitness is a family activity and a family that runs together will stay together forever. They keep propagating that theory. Members of Amaravati Runners have shown individual talent at the international level in both running and cycling. Wherever these team members are, they make it a daily routine to wake up at 5 am and happily walk for at least two hours.
సామాజిక కార్యక్రమాలు
తమ చుట్టూ సమాజంలో ఎలాంటి ఇబ్బందులు కనిపించినా స్పందించటం వీళ్ళ ప్రత్యేకత. కుల మతాలకు అతీతంగా తమకు సాధ్యమైనంత సహాయం అందించటం తమ బాధ్యతగా నమ్ముతారు. కోవిడ్ సమయంలో Shraamik Special రైళ్లలో విజయవాడ స్టేషన్ నుండి ప్రయాణిస్తున్న migrant laborers కు అమరావతి రన్నర్స్ అందించిన సహాయం మరువలేనిది. ప్రతిరోజూ కొన్నివేల మందికి ఆహారం, మంచినీరు అందించి ఆదుకున్నారు. వీరిని చూసి ప్రేరణతో విజయవాడలోని ఇంకా ఎన్నో సంస్థలు స్పందించి సాయం చేయటం జరిగింది.
Social Initiatives
Their specialty is to respond to any problems in the society around them. They believe that it is their responsibility to help as much as they can, regardless of caste and religion. The help rendered by Amaravati Runners to migrant laborers traveling from Vijayawada station in Shramik special trains during Covid is unforgettable. They provided food and fresh water to several thousand people every day. Motivated by seeing them, many other organizations in Vijayawada responded and helped.
ప్రభుత్వం నుండి ఎలాంటి ప్రోత్సాహకాలు రాకుండా ఆర్ధిక ఇబ్బందులతో చదువు కొనసాగించలేని పేద విద్యార్థులకు తగిన ఆర్ధిక సాయం అందిస్తూ కొన్ని సంవత్సరాలుగా అమరావతి రన్నర్స్ కొనసాగిస్తున్న కార్యక్రమం చాలామంది పేద కుటుంబాలకు ఆసరా అయ్యింది. అలానే ఈ బృంద సభ్యుల జన్మదినాల సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రులలోనూ, నిరుపేద కాలనీలలోనూ వీరు చేసిన అన్నదానం కొన్ని వేల మంది ఆకలిని తీర్చింది.
The Amaravati Runners program has been supporting many poor families for several years by providing adequate financial assistance to poor students who cannot continue their studies without any incentives from the government. Also, on the occasion of the birthdays of these team members, the food donations made by them in government hospitals and poor colonies satisfied the hunger of a few thousand people.
ముందుకు నడుస్తూ ...
వ్యాయామంగానే కాకుండా ఉదయం నడక మనుషుల మధ్య దూరాన్ని తగ్గిస్తుంది. మనసువిప్పి వారి వారి ఇబ్బందులు ఒకరోతో ఒకరు పంచుకోవటం ద్వారా మానసిక వత్తిడిని తగ్గించుకునే అవకాశం కల్పిస్తుంది. ముఖ్యంగా పదవీ విరమణచేసి పిల్లలకు దూరంగా బ్రతుకుతున్న వృద్దులకు ఉదయం నడక ఒక వరం లాంటిది. ఇంత మంచిని కలిగించే నడక గురించి సమాజంలో అవగాహన కలిగించటం, దాని కోసం చిన్న నగరాలలో కూడా 10కే రన్ లను నిర్వహించటానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు మన అమరావతి రన్నర్స్. దానికి కావాల్సిన వనరుల గురించి ప్రభుత్వ అధికారులతో చర్చించి, వారి సహకారంతో తమ కార్యక్రమాలను రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలనుకుంటున్నారు.
Going Forward...
Apart from exercise, morning walk reduces the distance between people. Open mind provides an opportunity to reduce mental stress by sharing their problems with each other. A morning walk is a boon especially for the elderly who have retired and live away from their children. Our Amaravati Runners are planning to organize 10K runs in small cities to create awareness in the society about the benefits of walking. They want to discuss with the government officials about the resources required for it and expand their programs across the state with their cooperation.
Join Us Today
Take the first step towards a healthier and happier life by joining our events and supporting our cause.
Register now and be part of the positive change!